నవీపేట: ఐదు నెలల కొడుకుతో సహా రైలులోంచి ఓ మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి బ్రిడ్జికి సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి మండల కేంద్రానికి చెందిన హంగిర్గ సునీత(25), భర్త రాజు, కొడుకులు కేశవ్, శివశంభులతో కలసి ఉపాధి నిమిత్తం శనివారం పుణే ప్యాసింజర్‌లో నిజామాబాద్‌కు బయలుదేరారు.
రాజు, కేశవ్ నిద్రిస్తున్న సమయంలో సునీత కొడుకు శివశంభుతోపాటు ఒక్కసారిగా రైలులో నుంచి కిందికి దూకింది. దీంతో తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. నవీపేట ఎస్‌ఐ నరేశ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు.
కొడుకుతో కలసి మహిళ ఆత్మహత్య
Mar 4 2018 3:46 AM | Updated on Mar 4 2018 3:46 AM
Advertisement
Advertisement