ఒంగోలు నుంచి తెనాలి వెళుతున్న పాసింజర్ రైలులో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంజన్‌లో మంటలు లేచాయి. రైలు చిన్నగంజాం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో వెనుకనున్న ఇంజన్‌లో బ్యాటరీలు వేడెక్కి మంటలు లేచాయి. దీంతో స్టేషన్‌లోని సిబ్బంది వెంటనే పౌడర్ చల్లి మంటలను ఆర్పివేశారు.
దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. అయితే, రైలులోని ప్రయాణికులు గంటన్నరపాటు ఎండ వేడికి తీవ్ర అవస్థలు పడ్డారు. పాసింజర్ రైలులోపల మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. గంటన్న వ్యవధిలో తెనాలి వైపు వెళ్లే మరొక రైలులో ప్రయాణికులను పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.