న్యూఇయర్‌కు వినూత్న స్వాగతం | Villagers Celebrate New Year With Train Decaration in West Godavari | Sakshi

న్యూఇయర్‌కు వినూత్న స్వాగతం

Jan 2 2020 12:11 PM | Updated on Jan 2 2020 12:11 PM

Villagers Celebrate New Year With Train Decaration in West Godavari - Sakshi

శెట్టిపేటలో ప్యాసింజర్‌ రైలును అలంకరిస్తున్న దృశ్యం

పశ్చిమగోదావరి ,నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామస్తులు ఏటా నూతన సంవత్సర వేడుకలు వినూత్నంగా నిర్వ స్తున్నారు. స్థానిక ఓల్డ్‌ క్రిస్టియన్‌ పేటకు చెందిన వైఎంసీఏ యూత్‌ సభ్యుల ఆధ్వర్యంలో 81 ఏళ్లుగా జనవరి 1న నిడదవోలు–భీమవరం ప్యాసింజర్‌ రైలుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం శెట్టిపేట రైల్వే గేటు వద్ద కొద్దిసేపు రైలును నిలుపుదల చేసి దాని ఇంజిన్‌కు అరటి బొంతలు, రంగుల జెండాలు కట్టి అలంకరించారు. రైలు డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామ పెద్దల నుంచి ఏటా రైలులో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది. దీంతో యూత్‌ సభ్యులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement