మంటల్లో ఇంజన్‌.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు | Meerut Train Fire Accident: Train Pushed By Passengers Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: ఐకమత్యమే మహాబలం! మంటల్లో ఇంజన్‌.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు

Published Sat, Mar 5 2022 12:02 PM | Last Updated on Sat, Mar 5 2022 12:09 PM

Meerut Train Fire Accident: Train Pushed By Passengers Video Viral - Sakshi

ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్‌ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. 

యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.  షార్నాపూర్‌-ఢిల్లీ మధ్య రైలు, మీరట్‌ దౌరాలా రైల్వే స్టేషన్‌ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్‌కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్‌, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్‌మెంట్‌లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.


కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది.  సాంబా నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్‌నాగ్‌ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement