train Fire accident
-
రైలు ప్రమాదంపై నేడు విశాఖకు దర్యాప్తు బృందాల రాక
-
బోగీల్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణీకులు
-
అగ్ని ప్రమాదానికి కారణం..?
-
కోర్బా విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు..
-
ఫలక్‌నూమా రైలులో మంటల కలకలం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
కోల్‌కతా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్(రైలు నెంబర్ 12703)లో ప్రయాణికులు మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకోబోతున్నామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భీతిల్లిపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రైలు బొమ్మాయిపల్లి – పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు రాగానే ఒక్క కుదుపుతో ఆగింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు ప్రయాణికులు కిందకు దూకి దూరంగా పరుగెత్తారు. ముందుగా ఒక బోగీ నుంచి మంటలు, పొగ రావడం చూసి అన్ని బోగీలలోని ప్రయాణికులు ఉన్నఫలంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. -సాక్షి, యాదాద్రి అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెల్‌ఫోన్ చాటింగ్‌లో కొందరు, వస్తున్నామంటూ తమ బంధువులకు సమాచారం ఇచ్చే వారు మరికొందరు, నిద్రలో ఉన్నవారు ఇంకొందరు ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా.. బోగీలకు మంటలు వ్యాపించాయనే సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు రావడంతో అరుపులు, కేకలు పెట్టారు. ఏమైందో అర్ధంకాక, ఏం చేయాలో తెలియక, భయం ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి పరుగులు తీశారు. పొగల వెంట మంటలు వస్తుండడంతో ప్రాణాలతో బయటపడతామా అంటూ కొందరు ఏడుపు మొదలు పెట్టారు. రైలు ఆగడంతో ఒక్క ఉదుటున ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తినంతా కూడగట్టుకుని రైల్లోంచి కిందికి దూకారు. రైలు పక్కన ఉన్న ఎత్తయిన మట్టిదిబ్బలను ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. బతుకుజీవుడా అంటూ దొరికిన వాహనం పట్టుకుని గమ్యస్థానం వైపు వెళ్లిపోయారు. అయితే, ఈ ప్రమాదంలో తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో విలువైన లగేజీని మాత్రం రైల్లోని వదిలివేయడంతో మంటలకు కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూటో.. లేక ఎవరైనా కావాలని చేశారో, మానవ తప్పిదంతో జరిగిందో తెలియదు కానీ, పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు బోగీల నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అత్యవసర కిటికీలో నుంచి బయటపడ్డారు. లగేజీ తక్కువగా ఉన్నవారు, మొత్తం లగేజీ లేని వారు ఒక్కో బ్యాగు ఉన్న వారు ముందుగా బయటపడ్డారు. ఓ వైపు మంటలు పెరిగిపోతున్నాయి.. బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. మరో వైపు కిక్కిరిసిన ప్రయాణికుల నుంచి బయటపడాలి. ఇంకో వైపు బ్యాగులు వెంట తీసుకుపోలేక నానా యాతనపడ్డారు. చూస్తుండగానే మంటలు బోగీ లకు వ్యాపించాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరెక్కడున్నారో తెలియని అయోమయం బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో ఒకరికొకరు కనిపించని భయానక పరిస్థితి, కుటుంబ సభ్యులు ఎక్కుడున్నారో తెలియని ఆందోళన. అయినా తమ ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని బతికి బయట పడాలన్న తపనతో ధైర్యం చేశారు. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుని తమ చేతికి అందిన లగేజీ బ్యాగులతో బయటపడ్డారు. బోగీ వెనక బోగీకి మంటలు చిన్నగా రేగిన మంటలు వరుసగా బోగీలకు వ్యాపించాయి. దట్టమైన పొగలతో పగిడిపల్లి ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. ఎస్4, ఎస్5, ఎస్6, ఎస్3, ఎస్2 బోగీలు మంటలో చిక్కుకున్నాయి. మంటల ధాటికి ఇనుప చువ్వలు, సీట్లు, బోగి పైబర్ అన్ని కాలుకుంటూ బోగీ మొత్తం వ్యాపించాయి. ఒక దాని తర్వాత మరొకటి చొప్పున మొత్తం 5 బోగీలు కాలిపోయాయి. మరో రెండు బోగీలు స్వల్పంగా కాలిపోయాయి. మైనారిటీ గురుకుల విద్యార్థుల సహాయక చర్యలు రైలులో మంటలు చెలరేగిన ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ శ్రీకాంత్ గుర్తించి మీడియా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే పాఠశాల టీచర్లు, విద్యార్థులు వెంటనే స్పందించి ప్రయాణికులను రైలు నుంచి జాగ్రత్తగా దింపి వారికి సహాయపడ్డారు. వారందరిని మైనారిటీ పాఠశాలకు చేర్చి మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. ఆటోలో హైవే వరకు చేర్చటం, అలాగే మిగిలిన ప్రయాణికులకు, పోలీసులకు, సహాయక సిబ్బందికి భోజనం వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, పోలీసు అధికారులు పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఫలక్‌నూమా రైలు అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. నా సర్టిఫికెట్లు కాలిపోయాయి నేను ప్రయాణం చేస్తున్న రైలు బోగి దగ్ధమైంది. నేను, మా అమ్మనాన్నతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్నాం. మా వద్ద మొత్తం 9 లగేజీ బ్యాగులు ఉన్నాయి. భయంతో నాలుగు బ్యాగులు మాత్రమే తీసుకుని కిందికి దిగాం. పదవ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ సర్టిపికెట్లు అన్నీ బ్యాగులోనే ఉన్నాయి. బ్యాగులన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు నా బాధను చెప్పాను. సర్టిఫికెట్లు జారీ కోసం సహాయం చేస్తాని హామీ ఇచ్చారు. – యశ్విత, ప్రయాణికురాలు, ఒడిశా చైన్ లాగి కిందికి దూకిన రాజు రైలులో పొగలు, మంటలు చెలరేగుతుండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అందులో ప్రయాణిస్తున్న రాజు అనే ప్రయాణికుడు రైలు చైన్ లాగి పక్కనే ఉన్న తన తల్లితో చెప్పి కిందికి దూకేశాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్పృహతప్పి కింద పడిపోయాడు. పోలీస్‌లు రాజును భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. సమన్వయంతో అదుపులోకి – కలెక్టర్ పమేలా సత్పతి అన్ని శాఖల సమన్వయంతో మంటలు ఆర్పినట్లు భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో.. రైలు అగ్నిప్రమాదానికి గురైన ప్రదేశాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సందర్శించారు. రైల్వే శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు. -
ఎప్పుడూ రద్దీనే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి ఆ పేరెలా వచ్చిందంటే..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్ తల్లిని ఆరాలు తీస్తున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్‌నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని. 🚆 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. 🚆 1993 అక్టోబర్ 15వ తేదీన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీస్ పట్టాలెక్కింది. 🚆హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. 🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది. 🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్, అలాగే 12704 సికింద్రాబాద్-హౌరా రూట్లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్ ముగిస్తుంది. 🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్లలో ఈ రైలు ఆగడం. 🚆 సికింద్రాబాద్-హౌరా మధ్యలో 24 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది. 🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్‌లను కలిగి ఉంటుంది. 🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్‌పూర్ జంక్షన్, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. 🚆గతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి) రేక్స్(కోచ్‌లను) మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-మన్మాడ్(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది. 🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్‌ఫాస్ట్ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్ చేస్తుంది భారతీయ రైల్వేస్. అందుకే ప్రయాణికులు ఈ రూట్లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఫలక్‌నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా? -
ముగిసిన ముద్రగడ పద్మనాభం రైలు దగ్ధం కేసు విచారణ
-
మంటల్లో ఇంజన్.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు
ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షార్నాపూర్-ఢిల్లీ మధ్య రైలు, మీరట్ దౌరాలా రైల్వే స్టేషన్ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్‌కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్మెంట్లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut. Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. కశ్మీర్లో రోడ్డు ప్రమాదం జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. సాంబా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్‌నాగ్ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. -
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
మంటల్లో చిక్కుకున్న ఏపీ ఎక్స్‌ప్రెస్