చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్‌బ్యాక్‌లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల‍్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు.
ఏమేం మార్పులంటే..
► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు.
కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.
► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్‌తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్‌లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్‌లో మార్పులు చేయనున్నారు.
► వందే భారత్ రైళ్లలో కోచ్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్‌తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్‌టైట్ ప్యానల్స్‌లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్‌ను లోకో పైలట్‌కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్‌లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు.
► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్‌లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment