రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9 నుంచి 11వ
తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గురువారం కొన్ని రైళ్లను రద్దు చేశామని, ఒక రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడ–బిట్రగుంట (07978), విజయవాడ–గూడూరు (07500), ఒంగోలు–విజయవాడ (07576) రైళ్లు, 10, 11 తేదీల్లో గూడూరు–విజయవాడ (07458), 10న కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు (17268), విజయవాడ–ఒంగోలు (07461), విజయవాడ–గుంటూరు (07783), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్–బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. అదేవిధంగా కాకినాడ పోర్టు–విజయవాడ (17258) రైలును ఈ నెల 10న కాకినాడ పోర్టు–రాజమండ్రి మధ్య, విజయవాడ–కాకినాడ పోర్టు (17257) రైలును ఈ నెల 9, 10 తేదీల్లో రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment