సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపుల జాబితాను పెంచింది. ఇక నుంచి కొన్ని స్టేషన్లలో తాత్కాలికంగా ఆగనున్నట్లు పేర్కొంది. ఆరు నెలలు పరిశీలించి, ప్రయాణికుల నుంచి స్పందన మెరుగ్గా ఉంటే కొనసాగిస్తామని తెలిపింది.
తిరుపతి–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై–సికింద్రాబాద్–విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగర్‌సోల్–నర్సాపూర్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, భద్రాచలం రోడ్డు– బల్లార్షా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్, మైసూరు–దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–బెనారస్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్–తిరుపతి çసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్‌ప్రెస్, చార్మినార్–పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్–లక్నో ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–మధురై ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–కరైకల్ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్–సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్– కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు–కాకినాడ ఎక్స్‌ప్రెస్, డెల్లా ఎక్స్‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్, బిలాస్‌పూర్–ఎక్స్‌ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, రాప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–కాచిగూడ ఎక్స్‌ప్రెస్, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, యలహంక–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని తాత్కాలిక స్టాపులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment