లక్నో : వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సహజంగానే అనేక బరువులు నెత్తినేసుకొని బతికే బతుకు జీవుల పాలిట కరోనా మహమ్మారి దించనంత బరువులు మూటగట్టింది. స్వస్థలాలకు చేరేందుకు వారు పడతున్న పాట్లు వర్ణనాతీతం. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న దృశ్యాలు అనేకం. తాజాగా శ్రామిక్ రైలులో స్వస్థలానికి పయనమైన కుటుంబంలో చిన్నారి మరణం విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం..బీహార్‌కు చెందిన ప్రియాంక దేవి కొన్ని నెలల క్రితమే ఉత్తరప్రదేశ్ నోయిడాలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. తీరా లాక్‌డౌన్ ప్రకటించేసరికి ఏం అక్కడే ఉండిపోయింది.
ప్రస్తుతం కేంద్రం వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు శ్రామిక్‌రైలును ఏర్పాటు చేసినందున తండ్రి దేవ్‌లాల్ , తన 10 నెలల చిన్నారితో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. అప్పటికే చిన్నారికి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరిస్థితిపై రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేయగా..తుండ్లా రైల్వేస్టేషన్‌లో వైద్యుడు ఉన్నారని, అక్కడికి చేరుకున్నాక చూద్దాం అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దేవ్‌లాల్ ఆరోపించారు. తుండ్లా చేరుకునే వారకు చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించిందని, హాస్పిటల్‌కి తరలించే లోపే కన్నుమూసినట్లు పేర్కొన్నాడు. సరైన సమయానికి వైద్యం అందించే ఉంటే చిన్నారి బతికేదని, రైల్వే అధికారుల నిర్లక్షమే బాలుడి ప్రాణం తీసిందని ఆరోపించాడు.
(తొలి రోజు అనుభవాలు వెల్లడించిన విమానాయన సిబ్బంది )
మరో ఘటనలో శ్రామిక్ రైలులో ప్రయాణిస్తున్న 46 ఏళ్ల వలస కార్మికుడు ఆకలితో అలమటించి మరణించాడు. వివరాల ప్రకారం..మే 20న ముంబైలోని శ్రామిక్ రైలులో బయలుదేరి మే 23న వారణాసికి నేను, మామయ్య చేరుకున్నాం. అంత దూర ప్రయాణంలోనూ రైల్వే అధికారులు కనీసం తిండి, నీరు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. రైలు ఎక్కేముందు నుంచే ఆకలితో ఉన్నాం. కానీ కొనడానికి చేతిలో డబ్బులు కూడా లేవు. దీంతో ఆకలితో అలాగే ఉండాల్సి వచ్చింది. స్వస్థలానికి అరగంటలోపు చేరుకుంటాం అనగా, తీవ్రమైన నొప్పితో మామయ్య మార్ఛపోయాడు. దాదాపు 60 గంటల నుంచి ఆహారం కనీసం నీళ్లు కూడా అందక పోవడంతో మరణించాడు అని రవీష్ యాదవ్ తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వలసకూలీలకు కనీస సౌకర్యాలైనా కల్పించాలని కోరాడు. (ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం )
Comments
Please login to add a commentAdd a comment