సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల తరలింపుపై కేంద్రం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను తరలించాలన్న పాత నిబంధనను తొలగించింది. అలాగే లాక్‌డౌక్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. (కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు)
కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది కాలినడనక స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీనిపై కూడా కేంద్ర హోంశాఖ స్పందించింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతునన రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు రైల్వేలతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో ఓ అంచనాకు వచ్చి ఆ వివరాలను రైల్వేశాఖతో పంచుకోవాలని తెలిపింది. కేంద్రహోంశాఖ తాజా నిర్ణయంతో శ్రామిక్ రైళ్ల సంఖ్య పెరగనుంది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు)
Comments
Please login to add a commentAdd a comment