న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్‌లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు.
త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment