
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు బోగీలలోని కొత్తగా రూపొందించిన టాయిలెట్ల డిజైన్లను తనఖీ చేశారు. కొత్త హంగులతో ఆధునికరించిన మరుగుదొడ్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అక్కడ ఒక వ్యక్తి చేసిన వర్క్ గురించి మంత్రికి వివరిస్తున్నాడు. ఆ వీడియోలో చాలా వరకు మరుగుదొడ్లను బాగా ఆధునీకరించారు. మంత్రి అశ్విన్ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ చక్కగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ట్రైయిన్‌లు కూడా చెత్తతో పేరుకుపోయి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. పైగా ప్రజలను కూడా రైళ్లు శుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలని విజ‍్క్షప్తి చేశారు కూడా. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు, భవిష్యత్తులో కూడా ఇలానే మెయింటెన్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తూ..ట్వీట్ చేశారు.
Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023
(చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే)
Comments
Please login to add a commentAdd a comment