Wheelchairs
-
వీల్‌చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
దివ్యాంగులకు ఎలక్ట్రిక్ పరికరాల పంపిణీ
సికింద్రాబాద్: దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి అన్నారు. శనివారం సీతాఫల్‌మండిలోని మధురానగర్ కాలనీలోని రాఘవ గార్డెన్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.కోటి 70లక్షల విలువ గల బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్, హెల్మెట్లు, వివిధ పరికరాలను 200మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంతో మంది వికలాంగులను గుర్తించి వారికి కావాల్సిన పరికరాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, నేతలు మేకల కీర్తి, బండపెల్లి సతీష్, కనకట్ల హరి, ప్రభుగుప్త, నాగేశ్వర్‌రెడ్డి, గణేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
హే రాం...
గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రి.. ఈ పేరు వింటేనే రోగులకు అదో ధైర్యం..అయితే ఇక్కడ మాత్రం సౌకర్యాలు మరీ దారుణంగా ఉన్నాయి.. నడవలేని స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు కూడా స్ట్రెచర్లు లేవంటే పాలకులకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది. దాతలు ఆస్పత్రికి విరాళంగా అందజేసిన వీల్చైర్లు, స్ట్రెచర్లు స్టోర్రూంకే పరిమితమవుతున్నాయి. సోమవారం ప్రాణాపాయస్థితిలో ఉన్న తన తల్లిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ వ్యక్తి వీల్ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో ఇలా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లాడు.ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి. - ఫొటో : వర్థెల్లి రవీందర్