ramps
-
వీల్‌చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
ఈ కష్ట‘మెట్లు’ తప్పున్!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా.. విద్యార్థులు, ఉద్యోగులు బస్‌పాస్‌లు తీసుకోవాలన్నా అందుబాటులో ఉన్నది ఏకైక వసతి మెట్ల మార్గమే. రెండంతస్తులు పైకి వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సుల్లో రెతిఫైల్కు చేరుకునేవారు, దూరప్రాంతాల నుంచి రైళ్లలో సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు కోసం ఈ మెట్ల మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి.. అటు మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి ఎలాంటి కుదుపు లేకుండా మెట్రో రైళ్లలో హాయిగా సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకున్నవారు రెతిఫైల్ మెట్లను ఎక్కలేక, దిగలేక చుక్కలు చూస్తున్నారు. పైగా ఈ మెట్లు ఎంతో ఇరుకుగా, నిటారుగా ఉండడంతో పిల్లలు, మహిళలు, వయోధికులు అవస్థలు పడుతున్నారు. లగేజీతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రెతిఫైల్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కలేకపోతున్నారు. మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లను అనుసంధానం చేసేలా ఉన్న రెతిఫైల్ బస్‌స్టేషన్‌లో కనీస సదుపాయాలు లేకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది. కొరవడిన సమన్వయం... ♦ రెతిఫైల్ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గురుద్వారా, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు సుమారు 1500కు పైగా బస్సులు ఆయా బస్టాపుల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది సికింద్రాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. ♦ మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. మెట్రో రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే తప్పనిసరిగా రెతిఫైల్ నుంచి వెళ్లాల్సిందే. నిత్యం సుమారు 10 వేల మంది ప్రయాణికులు మెట్రో నుంచి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోసం రెతిఫైల్ మీదుగా వెళ్తారు. ఆరీ్టసీ, మెట్రోరైల్, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం కొరవడడంతో రెతిఫైల్ స్టేషన్లో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ వాస్తవానికి ఇది ఆర్టీసీకి చెందిన ప్రయాణికుల ప్రాంగణం. ఈ బస్‌స్టేషన్‌లో అద్దెల రూపంలో ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం లభిస్తోంది. కానీ ప్రయాణికుల సదుపాయాలపై మాత్రం ఆర్టీసీ దృష్టి సారించడం లేదు. రైలు, బస్సులు, మెట్రో మధ్య అనుసంధానం కోసం ఈ స్టేషన్‌కు ఆధునిక హంగులు కల్పించే అవకాశం ఉంది. కానీ మెట్రో, ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులు ఒక కనెక్టివిటీ నుంచి మరో కనెక్టివిటీకి సాఫీగా చేరుకోలేకపోతున్నారు. ర్యాంపులు, లిఫ్ట్‌లు అవసరం... ♦ మెట్రో రైళ్లకు, సాధారణ రైళ్లకు అనుసంధానంగా ఉన్న రెతిఫైల్ నుంచి రాకపోకలు సాగించేందుకు ర్యాంపులు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఎంతో అవసరం. భారీ లగేజీతో సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకొనేవారు అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా రెండంతస్తుల మెట్లు ఎక్కడం కష్టంగా మారింది. కొద్ది పాటి సదుపాయాలతో ప్రయాణికులకు మూడు ప్రజారవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసురావచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడు సంస్థల మధ్య సమన్వయమే. -
ఇసుక ర్యాంపులపై దాడులు
- 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం - కలెక్టర్ కార్తికేయ ఆదేశాలతో కదిలిన భూగర్భ గనులశాఖ యంత్రాంగం - ‘సాక్షి’ ఫోకస్‌కు ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్న అక్రమార్కులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. జిల్లాలో అనుమతి లేని ఇసుక ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలించి లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక దందాను గత నెల 23న ‘ప్రతిరేణువుకూ రేటే’ శీర్షికన ‘సాక్షి ఫోకస్’ ద్వారా ఫొటోలతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక సమాచారం రప్పించుకున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పందించారు. గనులు, భూగర్భజల శాఖాధికారులతో ఇసుక ర్యాంపుల తనిఖీలు జరపాలంటూ ఆదేశించారు. ఈ మేరకు సంబంధితశాఖలోని రెగ్యులర్, విజిలెన్స్ విభాగాలకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, స్థానిక రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. సాక్షి పత్రికే అజెండా... జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం, కోరుమిల్లి, తాతపూడి, రాజమహేంద్రవరం కుమారి టాకీస్, వేమగిరి, కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి, తునిలో తాండవ నది తదితర ర్యాంపుల్లో ఇసుకను అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో ఇసుక అక్రమాలు అధికంగా జరుగుతున్న కపిలేశ్వరపురం మండలంలోని పలు ర్యాంపులపై దాడులు నిర్వహించారు. మైన్స్ శాఖ రాజమహేంద్రవరం ఆర్ఐ ఎస్.లక్ష్మీనారాయణ, మైన్స్ విజిలెన్స్ (రాజమహేంద్రవరం) ఆర్ఐ పి.మురళి ఆధ్వర్యంలోని బృందం కోరుమిల్లి, కపిలేశ్వరపుర, మాచర గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మొదట తాతపూడి ర్యాంపును తనిఖీ చేశారు. యూనిట్ ఇసుక రూ.750లకు బదులు రూ.1100లు విక్రయిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇలాగే ధరలు పెంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు అక్కడి నిర్వాహకులను హెచ్చరించారు. సీజ్ చేసిన 1062 క్యూబిక్ మీటర్ల ఇసుక... కోరుమిల్లి, కపిలేశ్వరపురం ర్యాంపుల పరిధిలో పరిసర గ్రామాల్లో వీఆర్వోలతో కలిసి తనిఖీలు నిర్వహించి 13 గుట్టలుగా ఉన్న 1062 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. కోరుమిల్లి ఆరోగ్య ఉప కేంద్రం, శివాలయం, మాచర శివారుల్లో పలు గుట్టలను గుర్తించారు. ఇసుకను లారీలో లోడింగ్ చేసినప్పుడు ఒక యూనిట్ అదనంగా వేయించుకుని నిల్వ చేసుకుని లాభపడుతున్నారని తేల్చారు. కపిలేశ్వరపురం–2 ర్యాంపు సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో ఇసుక గుట్టలను స్వాధీనం చేసుకుని వీఆర్వోలు తవిటికి సత్యనారాయణ, వెంకటరమణకు అప్పగించారు. దేశం నేతల పైరవీలు... ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిల్వలను స్వాధీనం చేసుకుంటుండగా అధికార పార్టీ నేతలు కొందరు అడ్డంపడ్డారు. ఇంటి పునాదులు కోసం నిల్వ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పునాదులకు ఉచిత ఇసుకను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆ నిల్వలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నిర్మాణాల కోసం తెచ్చుకున్న వాటిని అక్రమం నిల్వలుగా నిర్ధారించడం సరికాదని వాదనకు దిగారు. ఇంటి నిర్మాణ ప్రదేశంలో లేని నిల్వలను స్వాధీన పర్చుకుంటామన్నారు. నిర్మాణం జరుగుతున్నట్టు వీఆర్వోల సమక్షంలో నిరూపించుకుంటే తిరిగి నిల్వలను వినియోగించుకోవచ్చని మైన్స్ అధికారులు వారికి చెప్పారు.. ఈ సందర్భంగా మైన్స్ ఆర్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 5తో కోరుమిల్లి–2, మార్చి–31తో కోరుమిల్లి–1 ర్యాంపులకు గడువు ముగిసిందన్నారు. కపిలేశ్వరపురం–1 ర్యాంపు 2018 ఫిబ్రవరి 16, తాతపూడి ర్యాంపు 2017 నవంబరు 27 వరకు అనుమతి ఉందన్నారు. త్వరలో కపిలేశ్వరపురం–3, కోరుమిల్లి–2, కేదారిలంక ర్యాంపులపై కసరత్తు జరుగుతోందన్నారు. ఈ దాడుల్లో ఎంపీడీఓ వి.అబ్రహంలింకన్, తహసీల్దారు కేపీ నరసింహులు, అంగర ఎస్సై వాసా పెద్దిరాజు, గోదావరి హెడ్ వర్క్స్ ఏఈ డి.రాధాకృష్ణ, వీఆర్వోలు ఎస్.సత్యనారాయణ, వీరబాబు, టి.సత్యనారాయణ, వెంకటరమణలతో కలిసి మైన్స్ అధికారులు పాల్గొన్నారు. -
ఆధునికీకరణ పనుల్లో దగా!
లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ రైతులకు ఉపయోగపడని పనులు చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైనింగ్‌పోయి రిటైనింగ్ వచ్చే! రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి. పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు, అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్‌కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. మేటవేసిన పంట కాలువలు ... ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్‌వాల్‌గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు. పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు.