సాక్షి, హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్-నాగ్‌పుర్ వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించారు.
సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్‌లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేశారు.
ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?
Comments
Please login to add a commentAdd a comment