
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 22 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సికింద్రాబాద్–కొల్లాం (07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్–కొట్టాయం (0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.