సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ఈ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. చైర్‌కార్ సదుపాయం ఉన్న ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. అనూహ్య రీతిలో ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. రోజూ వంద శాతం ఆక్యుపెన్సీతో వందేభారత్ పరుగులు తీస్తోంది.
ఈ క్రమంలోనే కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–పూనేల మధ్య త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. రైళ్ల నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. వందేభారత్ రైళ్ల కోసం డిపోల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment