ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనేది సర్వత్రా.. అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆ ఘటన గురించి ప్రత్యక్షసాక్షులు, అధికారుల కథనం మేరకు..ఈ భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కోరమాండల్ షాలిమర్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడం తోపాటు గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ అనే మరోరైలు పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు. మూడవ రైలు అదే సైట్‌లో ఆపి ఉంచిన గూడ్స్ రైలు ప్రమాదం బారిన పడినట్లు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ పెను ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు.
ఇక కార్యాచరణ వైఫల్యంపై ప్రశ్నల నేపథ్యంలో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే క్రాష్ జరిగిన ప్రదేశంలో సీసీఫుటేజ్ విజ్యువల్స్‌లో పట్టాలపై రైలు కోచ్‌లు చిన్నాభిన్నామై పోతున్నట్లుగా మెలిపెట్టే దృశ్యాలు కనిపించాయి.
(చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం)
Comments
Please login to add a commentAdd a comment