యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం | Hijras Attack on Yesvantpur Express Passengers | Sakshi
Sakshi News home page

డబ్బు లాక్కుని, టికెట్ల చించివేత

Published Fri, Jul 12 2019 7:41 AM | Last Updated on Fri, Jul 12 2019 7:41 AM

Hijras Attack on Yesvantpur Express Passengers - Sakshi

కర్ణాటక, గుంతకల్లు: బెంగళూరు యశ్వంతపూర్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ప్రయానికుల నుంచి డబ్బులు లాక్కోవడంతో పాటు టికెట్లు చించివేసి భయబ్రాంతులకు గురి చేశారు. వివరాలు.. యశ్వంతపూర్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ధర్మవరం చేరిన తరువాత కొందరు హిజ్రాలు ఎక్కారు. రైలు కల్లూరు స్టేషన్‌ దాటిన తరువాత పెన్నానది వంతెనపై ఎస్‌–3 నుంచి ఎస్‌–6 బోగీల్లోని చొరబడి సుమారు 15 మంది హిజ్రాలు బీభత్సం సృష్టించారు. కొందరి నుంచి అందినకాడికి డబ్బు లాక్కుతున్నారు.  డబ్బులు ఇవ్వనందుకు కొందరి టికెట్లను చించివేశారు. తీరిగ్గా చైను లాగి దిగి వెళ్లిపోయారు.

గుంతకల్లులో ప్రయాణికుల ధర్నా  
ఈ విషయంపై కొందరు బాధితులు ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు సమాచారమందించారు. ఈ రైలు గుంతకల్లు జంక్షన్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంది. హిజ్రాల దాడిలో జేబులు ఖాళీ అయిన ప్రయాణికులంతా ప్లాట్‌ఫారంపై బైఠాయించి రైలును ముందుకు కదలనివ్వకుండా అరగంటకుపైగా ఆందోళన చేశారు. తక్షణం హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ సాయిప్రసాద్, ఏఎస్‌ఐ ఆనందప్పలు ప్రయాణికులకు సర్దిచెప్పి రైలు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement