
సాక్షి, అనంతపురం : ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
కాగా అంతకు ముందు వరదాపురం సూరి జిల్లా ప్రధాన కార‍్యదర్శి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. అనివార్య కారణాల వల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీ అధిష్టాన ప్రతినిధులతో సంప్రతింపులు జరుపుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment