
ఎమ్మెల్యే వరదాపురం సూరీక (ఫైల్ ఫొటో)
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని పచ్చ పార్టీ నేతలు ప్రభుత్వ పథకాల మాటున ప్రజల్ని ఒత్తిడికి గురిచేస్తున్నారు. టీడీపీ కండువా మెడలో వేసుకుంటేనే పింఛన్లు ఇస్తామని బరితెగించి మాట్లాడుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని ధర్మవరంలో వెలుగు చూసింది. టీడీపీ కండువా వేసుకుంటేనే పింఛన్లు ఇవ్వాలని ధర్మవరం టీడీపీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు సమాచారం. పోతుకుంటకు చెందిన మత్స్యకారులకు ప్రభుత్వం ముంజూరు చేసిన పింఛన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే వరదాపురం సూరీ సమక్షంలో టీడీపీలో చేరితేనే ఇస్తామని మండల కన్వీనర్ రామస్వామి చెప్పినట్టు విమర్శలొస్తున్నాయి. ధర్మవరం టీడీపీ నేతల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment