
సాక్షి, అనంతపురం: జిల్లాలో దారుణం జరిగింది. గది అద్దెకు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నగరంలోని ఉమా లాడ్జికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉండటంతో లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య గదిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మద్యం మత్తులో ఆయనతో గొడవ పడి దారుణంగా హతమార్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment