నియోజకవర్గంలో నాటుసారా తయారీ, వ్యాపారంపై ఈనెల 11న వచ్చిన ‘సారోదయం’ కథనానికి ఎక్సైజ్ అధికారులు స్పందించారు.
ధర్మవరం టౌన్: నియోజకవర్గంలో నాటుసారా తయారీ, వ్యాపారంపై ఈనెల 11న వచ్చిన ‘సారోదయం’ కథనానికి ఎక్సైజ్ అధికారులు స్పందించారు. రాజధాని అమరావతి నుంచి స్టేట్ ఎక్సైజ్ డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో సీఐ నరసానాయుడు, ఇన్‌స్పెక్టర్ సుభానుల్లాల బృందం నియోజకవర్గంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనిపల్లి తండా, నేలకోటతండా,కామిరెడ్డిపల్లిలో సారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ ఎక్సైజ్ డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ నాటుసారా తయారీ, బెల్ట్‌షాపులను నిర్వహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట పరిధిలో కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. అనుమానితులను బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.