
ఉసురు తీసిన అప్పులు
ధర్మవరంలో ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ధర్మవరం అర్బన్: ధర్మవరంలో ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. లక్ష్మీచెన్నకేశవపురంలో నివసిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి, జయమ్మ దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌రెడ్డి (26) కూలి మగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. నేసిన చీరకు గిట్టుబాటుధరలు లభించకపోవడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు వారి నుంచి వేధింపులు తట్టుకోలేక ఆవేదనకు గురయ్యేవాడు. మంగళవారం రాత్రి కాలనీ సమీపంలోనే విజయ్‌కుమార్‌రెడ్డి విషపుగుళికలు మింగి అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
బంధువులు చుట్టుపక్కల గాలించి అతడిని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున విజయ్‌కుమార్‌రెడ్డి మృతిచెందాడు. పట్టణ ఎస్‌ఐ సురేష్ అనంతపురం ఆస్పత్రికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులతో తెలుసుకున్నారు. దాదాపు రూ.2లక్షల వరకు అప్పులున్నట్లు బంధువులు తెలిపారు. విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లక్ష్మీచెన్నకేశవపురానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.