ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ గడిచిన 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న నేతన్నలకు సంఘీభావం తెలిపి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం చేరుకున్నారు. మార్గం మధ్యంలోని సీతారాంపల్లి గ్రామంలో ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలలను పరిశీలించారు