వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్ జగన్ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది.