
సాక్షి, అనంతపురం : టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనీ, తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ నారాయణ రెడ్డిని అధికార టీడీపీ నేతలు సస్సెండ్ చేశారు. పదికోట్ల రూపాయల తాగునీటి బిల్లులను పక్కదారి పట్టించినందునే కౌన్సిలర్‌ను సస్సెండ్ చేశామని టీడీపీ నేతలు చెప్తుండగా.. ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఒత్తిడితోనే తనను సస్సెండ్ చేశారని నారాయణరెడ్డి చెప్తున్నారు. లేనిపోని ఆరోపణలతో తనపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే సూరి అవినీతికి నిరసనగా తహసీల్దార్ ఆఫీసు వద్ద ఆయన 48 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.