అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 62 మండలాల పరిధిలో వర్షం కురిసింది. దీంతో ఒకే రోజు 16.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ముదిగుబ్బలో 77 మి.మీ, ధర్మవరంలో 65.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే నార్పలలో 52.8 మి.మీ, తాడిమర్రిలో 47.3 మి.మీ, కనగానపల్లిలో 45.5 మి.మీ, కూడేరులో 37.3 మి.మీ, ఆత్మకూరులో 42.7 మి.మీ, వజ్రకరూరులో 30.2 మి.మీ, శింగనమలలోే 29.8 మి.మీ, పామిడిలో 27.3 మి.మీ, బత్తలపల్లిలో 27.6 మి.మీ, అమడగూరులో 29.9 మి.మీ, మడకశిరలో 33 మి.మీ, లేపాక్షిలో 32.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసింది. ఈ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 61 మి.మీ వర్షపాతం నమోదైంది.