
సాక్షి, అనంతపురం : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారానికి 36వ రోజుకి చేరుకుంది. శనివారం ఉదయం ఆయన ధర్మవరం నియోజకవర్గం చిగిచెర్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించి వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.