
టీడీపీలో జేసీ కంటే నేనే సీనియర్: దీపక్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి కన్నా తానే సీనియర్‌నని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు) అన్నారు.
రాయదుర్గం: తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి కన్నా తానే సీనియర్‌నని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ దీపక్‌రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు) అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక వేళ మా సామాజిక వర్గానికి రెండు స్థానాల్లో మాత్రమే టికెట్లు ఇవ్వదలచుకుంటే జేసీ బ్రదర్స్‌లో ఒకరికి టికెట్ ఇచ్చి మరో టికెట్‌ను నాకివ్వాలని అన్నారు.
రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు పోటీ చేయడాన్ని తాము తప్పుపట్టలేదని, అయితే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఇతరులకు సీట్లు ఇప్పించాలే కానీ ఒకరి సీటు లాక్కోవడం తగదన్నారు. 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయి రాజీనామా చేస్తానని చెబితే ‘పార్టీని బలోపేతం చేసుకో.. 2014 ఎన్నికల్లో నీకే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు.. ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేద’ని అన్నారు. బుధవారం పార్టీ అధినేతను కలిసి ప్రజల అభిప్రాయం తెలియజేస్తానన్నారు.