
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సమావేశాలు మొదలు కాగానే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మొదట బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది.
Comments
Please login to add a commentAdd a comment