సాక్షి, అమరావతి : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయవద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మనదేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment