
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లునుప్రవేశపెట్టనున్నారు.