
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం తరఫును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగ సందర్భంగా కోవిడ్ వారియర్స్ ప్రస్తావన తెచ్చిన మంత్రి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎందుర్కొంటోందని, దాని కారణంగా జీవన వ్యవహారమంతా ఒక్కసారిగా ఆగిపోయిందని అన్నారు. (పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు)
‘కరోనా వైరస్‌తో సాగిస్తున్న సమరంలో ప్రభుత్వం ముందు వరుసలో నిలబడమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పూర్తి అంకింతభావంతో శాయశక్తులు ఒడ్డి పోరాడుతోంది. అన్నింటికన్నా ముందు ఈ సమయంలో ముందు వరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి, గ్రామ, వార్డు వాలంటీర్లు, సబివాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, పంచాయతీ రాజ్, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment