రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందా? లేదా? అని శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ)లో చర్చకు వచ్చింది.
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందా? లేదా? అని శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బిజినెస్ అడ్వైజరీ కమిటీ-బీఏసీ)లో చర్చకు వచ్చింది. సభలో పాల్గొన్న సభ్యులే ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ ప్రారంభమయిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అజెండాలో కూడా ఆ అంశం ఉందని ఆయన తెలిపారు.
టీడీపీకి విభజనపై ఎటువంటి స్పష్టతలేదు. తెలంగాణ టిడిపి నేతలు విభజనకు ఆమోదిస్తుంటే, సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ మాత్రం శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని పట్టుబట్టింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ బిఏసి సమావేశానికి హాజరుకాలేదు. ఏ నిర్ణయం తీసుకోకుండానే బిఏసి సమావేశం ముగిసింది.