రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
తొలిరోజు సంతాప తీర్మానం.. వాయిదా
* తర్వాత 5 రోజులు సెలవు.. తిరిగి 29న ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఆకస్మికంగా మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డికి తొలిరోజున సంతాపం ప్రకటిస్తారు. సంతాప తీర్మానంపై ఆయా పక్షాల నేతలు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. అనంతరం బీఏసీ సమావేశం జరిగే వీలుంది.
అయితే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తిరిగి అసెంబ్లీ 29న మొదలుకానుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.