హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలనుంచి పలువులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీపై నిషేధం ఉండటంతో పార్టీ తరపున ఎవరూ పాల్గొనలేదు.
ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టాలని తీర్మానించారు. అందులో ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు, కేంద్ర జీఎస్టీ బిల్లుతోపాటు హెరిటేజ్కు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది.
రేపు 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ
Published Sat, Apr 15 2017 5:39 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement
Advertisement