
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షాలకు కావాల్సినంత సమయం ఇస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా మైక్ కట్ చేయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటి పనులను తాము చేయమన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం చాలా అర్థవంతంగా జరిగిందన్నారు. సభలో మొత్తం 23 అంశాల మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపు వంటి ముఖ్య అంశాలతో పాటు అగ్రిగోల్డ్, కె టాక్స్, ఉద్యోగుల సంక్షేమం, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలు మీద చర్చ ఉంటుందని తెలిపారు. సభ అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ ఎన్నిరోజులు జరపాలని సీఎం జగన్ ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడిని అడిగితే.. సమధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment