బీఏసీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ విజ్ఞప్తితో సోమవారం ఉదయం బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు.
కాగా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 6వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి. 20న సాధారణ బడ్జెట్, 22న వ్యవసాయ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల చట్టంలో సవరణలు, వ్యవసాయ మార్కెటింగ్ చట్టంలో సవరణలు, దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.