సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. 50 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు( శుక్రవారం) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసారి బీఏసీ సమావేశం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. ప్రతిరోజు గంటన్నర సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారలని నిర్ణయించారు. కాగా నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు.
ఈ సమావేశానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అనారోగ్యం కారణంగా స్పీకర్ మధుసూదనాచారి హాజరుకాలేదు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ , హరీశ్‌రావు, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment