తెలంగాణలో నెలకొన్న కరువు అంశంపై చర్చించాలని బీఏసీలో పట్టుపట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణలో నెలకొన్న కరువు అంశంపై చర్చించాలని బీఏసీలో పట్టుపట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ‍్మెల్యేలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి కారణంగా సమావేశాలను కొనసాగించలేకపోతున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. గట్టిగా పట్టుబట్టడంతో వచ్చే నెల 20వ తేదీ నుంచి పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రుణమాఫీ, మల్లన్నసాగర్, కరువు వంటి ప్రజా సమస్యలను ఈ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు.