'ప్రతిపక్షం గొంతు నొక్కే యత్నం చేస్తున్నారు'
హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం.. రెండే పక్షాలు ఉన్నా బీఏసీ సమావేశాని విపక్షం నుంచి ఎంతమందికి అవకాశం ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. బీఏసీలో సభ్యుల నియామకం సక్రమంగా లేదన్నారు.
సభలో ప్రవేశపెట్టే తీర్మానాల విషయాలను ముందు సమాచారం ఇస్తే బాగుంటుందని వైఎస్ జగన్ సభలో స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై యనమల రామకృష్ణుడు స్పందిస్తూ తీర్మానాలపై బీఏసీలో చర్చించామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశానికి రానందున సమాచారం తెలియకపోయి ఉండవచ్చునన్నారు.