హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం సమావేశమైన బీఏసీ పలు అంశాలపై చర్చించింది. నెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా అందుకు ప్రభుత్వం అందుకు నిరాకరించింది.
మరోవైపు సభలో ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాల అంశాన్ని పరిశీలించాలని బీఏసీ భేటీలో నిర్ణయం జరిగింది. అలాగే బడ్జెట్పై నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ జరగనుంది. కాగా సమావేశాల పొడిగింపుపై బీఏసీ మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.