27 నుంచి తెలంగాణ అసెంబ్లీ | Telangana Assembly winter session on November 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి తెలంగాణ అసెంబ్లీ

Published Tue, Oct 17 2017 2:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈ నెల27నుంచి ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న బీఏసీ సమావేశంలో షెడ్యూల్‌ ఖరారు కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని అంశాలపై కులంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సభలో ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్నించినా జవాబు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సభ హుందాగా నడవాలని, ప్రతి అంశంపై చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement