ఏపీ బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్) సమావేశం సోమవారమిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్పీకర్ ...
హైదరాబాద్ : ఏపీ బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్) సమావేశం సోమవారమిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్లొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.