అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలను వచ్చే 10 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది.
సెస్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2, 3, 4 తేదీల్లో సెలవు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. గంటన్నరపాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఈరోజు సమావేశమైన అసెంబ్లీ 28వ తేదీ వరకు వాయిదా పడింది. తిరిగి అసెంబ్లీ ఈనెల 29న మొదలుకానుంది. అదే రోజు రైతు ఆత్మహత్యలపై చర్చించనున్నారు.