
ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధం: హరీశ్
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్న శాసనసభలోనే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం గర్వంగా ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్న శాసనసభలోనే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం గర్వంగా ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలన్న దానిపై బుధవారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.