'వరంగల్లో మాదే విజయం' | digvijay singh comments on kcr governament | Sakshi
Sakshi News home page

'వరంగల్లో మాదే విజయం'

Nov 15 2015 3:28 PM | Updated on Aug 14 2018 4:32 PM

'వరంగల్లో మాదే విజయం' - Sakshi

'వరంగల్లో మాదే విజయం'

వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం పరాకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొన్నారు.

వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం పరాకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో దిగ్విజయ్ సింగ్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ అవలంభించిన నిరంకుశ పాలన వలనే ఉపఎన్నికలు వచ్చాయని అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలంతా కాంగ్రేస్ను గెలిపించుకోవాలని మీరా కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పాడని ఆమె విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement