
సాక్షి,హైదరాబాద్: ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. కోట్‌పల్లి మండలం లింగంపల్లికి చెందిన ఓ బాలిక వికా రాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఆమె కాలేజీకి వెళ్లేందుకు కోట్‌పల్లి పెట్రోల్ పంపు వద్ద బస్సు కోసం చూస్తుండగా కోట్‌పల్లి నివాసి ఉప్పరి రమేశ్ బైక్‌పై అటుగా వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. రమేశ్‌పై పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ తెలిపారు.
మరో ఘటనలో..
మాడ్గుల: మద్యం మత్తులో ఓ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మండలంలోని చంద్రాయన్‌పల్లికి చెందిన ఓ బాలిక (9) తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బైకని వెంకటయ్య(45) ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు విప్పేసి అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురై న బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బద్యానాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment