నిర్భయ చట్టం కింద కేసు నమోదు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట శివార్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలి పిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి (22) నగరంలోని హాస్టల్‌లో ఉంటూ ‘లా’ చదువుతోంది. ఎల్‌బీనగర్‌కు చెందిన యువకుడు రెం డేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ సోమవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేటలోని శబరిహిల్స్ వెంచర్‌లోని ఓ పాడుబడ్డ గదిలోకి వెళ్లారు.
ఇది గమనించిన నల్లబోలు శ్రీనివాస్‌రెడ్డి (32), బండి లింగారెడ్డి (27) తమ సెల్‌ఫోన్‌లో వారి ఏకాంత దృశ్యాలను చిత్రీకరించారు. తర్వాత యువకుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఫోన్‌లోని దృశ్యాలను యువతికి చూపించి బెదిరించారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి ఫోన్ నంబర్ తీసుకొని పిలిచినప్పుడుల్లా వచ్చి తమ కోరిక తీర్చాలని లేకుంటే దృశ్యాలను బయట పెడతామని హెచ్చరిం చారు. మరుసటి రోజు నిందితులు యువతికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని వేధించారు. వారి వేధింపులు తాళలేక యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది.
దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డిలను పెద్దఅంబర్‌పేట చౌరస్తాలో అరెస్టు చేశారు. గురువారం హయత్‌నగర్ 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మేజి స్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపెడ గ్రామం. కొన్నాళ్లుగా పెద్దఅంబర్‌పేటలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. లింగారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం పెద్దవీడు.
ప్రస్తుతం పెద్ద అంబర్‌పేటలో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఫోన్లలో ఉన్న దృశ్యాలను తొలగించారని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు వారి ఫోన్‌లను పంపించి ఆ దృశ్యాలు ఇంకా ఎవరికైనా పంపారా అనే విషయాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. శివారులోని నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీని మరింతగా పెంచుతామని చెప్పారు.
అత్యాచార ఘటనలో నిందితులకు రిమాండ్
Published Fri, Dec 5 2014 1:34 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
Advertisement
Advertisement